దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రెండో దశలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజుకు 25వేలకు పైగా కేసులతో నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించింది అక్కడి ఆప్‌ సర్కార్‌. అయితే  ఢిల్లీలోని పలు ఆసుపత్రులు ఆక్సిజన్ కొరతతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.  ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ ఆసుపత్రి చీఫ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ పరిస్ధితుల పై ఆవేదన వ్యక్తం చేసారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తమ హాస్పిటల్ లో ఆక్సిజన్  అయిపోవస్తోందని , మరో రెండు గంటలు.. లేదా అంతకన్నా ముందే అయిపోతుందని..  110 మంది రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నామని, వీరిలో 12 మంది వెంటిలేటర్లపై ఉన్నారని ఆయన చెప్పారు. ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన, దయనీయమైన పరిస్థితి అని, తమ కళ్ళ ముందే రోగులు మరణిస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంటున్నామని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: