విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పై ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సంచలన ట్వీట్‌ చేశారు. విశాఖ ఉక్కు రోజుకు 100 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తోందని,కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుతోందని, అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఎంతవరకు సబబు? అని చిరంజీవి ప్రశ్నించారు.

ఈ మేరకు ఆయన  అధికారిక ట్విట్టర్ ఖాతలో.. "దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషంట్స్ అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడ నుండి 150 టన్నుల ఆక్సిజన్ ని మహరాష్ట్ర తీసుకెళ్తుంది. విశాఖ ఉక్కు రోజుకు 100 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్ధితిల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలను నిలబెడుతుంది. అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఎంతవరకు సబబు? మీరే ఆలోచించండి." అంటూ ట్వీట్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: