ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. ఈ మేరకు గురువారం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 9,97,462 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 7,541 మంది కరోనాతో మృతి చెందారు. ఇక తాజాగా.. అనంతపురం 789, చిత్తూరు 1474, తూర్పు గోదావరి 992, గుంటూరు 1186, కడప 279, క్రిష్ణా 679, కర్నూలు 1367, నెల్లూరు 816, ప్రకాశం 345, శ్రీకాకుళం 1336, విశాఖపట్నం 844 , విజయనగరం 562, పశ్చిమ గోదావరి 90 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 9,716 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 10,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. దీంతో మహమ్మరి కరోనా తన రికార్డ్ తానే బద్ధలు కొట్టుకున్నట్లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: