ఓ వైపు క‌రోనా సోకితే వైద్యం అంద‌డం లేదు. ఏ హాస్ప‌ట‌ల్ కూడా వైద్యం చేసేందుకు ముందుకు రాని ప‌రిస్థితి. ఇక హాస్ప‌ట‌ల్స్‌లో ఉన్న వారిని కూడా వైద్యులు జాగ్ర‌త్త‌లు పాటిస్తూ స‌రిగా వైద్యం చేయ‌డం లేదు. తాజాగా మహారాష్ట్రలో కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ కరోనా ఆస్పత్రిలోని ఐసీయూ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చికిత్స పొందుతున్న 12 రోగులు సజీవ దహనం అయ్యారు.

అందరు నిద్రలో ఉండటం, మంటలు వేగంగా వ్యాపించడంతో...రోగులు బయటకు వెళ్లలేకపోయారు. మ‌రి కొంత మందికి తీవ్ర గాయాలు అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక కొద్ది రోజుల క్రిత‌మే నాసిక్‌లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఈ నెల 21 న ఆక్సీజన్ ట్యాంకర్ లీకైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలో ఉన్న దాదాపు 22 మంది రోగులకు పైగా మరణించారు.

ఇక గ‌తేడాది ఏపీలో విజ‌య‌వాడ‌లో ర‌మేష్ హాస్ప‌ట‌ల్‌కు అనుబంధంగా ఉన్న ఓ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతోన్న కోవిడ్ రోగులు సైతం షార్ట్ స‌ర్క్కూట్‌తో మంట‌లు చెల‌రేగి స‌జీవ ద‌హ‌నం అయిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: