కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. దీంతో అసలే పీకల్లోతు కష్టల్లో ఉన్న ఏపీకి మరో సమస్య వచ్చిపడ్డింది. ఏపీకి ఆర్ధిక క‌ష్టాలు ఒక్కోక్కటిగా వెంటాడుతూనే ఉన్నాయి. న‌వ‌ర‌త్నాల అమలులో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి.. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ టీకా రూపంలో జగన్ సర్కార్ కి మరో కొత్త సమస్య తెచ్చింది. కరోనా కట్టడిలో భాగంగా .. 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని కేంద్ర నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుటి వ‌ర‌కు కొవిడ్ టీకా లు సరఫరా చేసిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం.. అంటే మే 1 నుండి టీకాల బాధ్యత రాష్ట్రాల‌దే అంటూ చేతులేత్తేసింది. దీంతో..టీకా రూపంలో ప్రభుత్వంపై మరింత భారం పడనుంది. మరి జగన్ సర్కార్ ఈ సమస్యని ఎలా సమర్ధవంతంగా ఎదురుకుంటారో చూడాలి..!!



మరింత సమాచారం తెలుసుకోండి: