తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌ను పోలీసులు ఈ రోజు తెల్ల‌వారు ఝామునే అరెస్టు చేశారు. సంగం డైయిరీలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఏసీబీ అభియోగాలు మోపి.. ఆయ‌న ఇళ్లు అయిన చింత‌ల‌పూడిలో ఉద‌యమే ఏకంగా 100 మంది పోలీసులు మోహ‌రించారు. ఈ సంస్థ‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న నేప‌థ్యంలోనే ఆయ‌న్ను 408, 409, 418, 420, 465 సెక్ష‌న్ల కింద అరెస్టు చేశారు. మ‌రోవైపు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా న‌రేంద్ర‌ను అరెస్టు చేయ‌డంతో టీడీపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి.
ధూళిపాళ్ల అరెస్ట్‌ను టీడీపీనేత నారా లోకేష్ ఖండించారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఎలా అరెస్ట్ చేస్తారంటూ జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని..అరెస్ట్‌లతో టీడీపీ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో వైసీపీ ప్రభుత్వం రాక్షసానందం పొందతుున్నారని నారా లోకేష్ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: