శుక్రవారం నాడు జగన్ తన రాష్ట్ర అక్క చెల్లమ్మలకు తీపి కబురు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెండో ఏడాది కూడా వడ్డీని ఏపీ ప్రభుత్వం బ్యాంకుల్లో వడ్డీ డబ్బులను జమ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు జగన్ శుక్రవారం ..1.02 కోట్ల స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ రూ. 1,109 కోట్లు నిధులను ప్రభుత్వం తరపున ఆయా సంఘాల ఖాతాల్లో సీఎం జగన్ ఆన్‌లైన్ ద్వారా జమచేయనున్నారు.  దీనిలో భాగంగా.. జిల్లా స్థాయిలో ఇన్‌చార్జ్ మంత్రులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సంధర్భంగా... ప్రతి మహిళను లక్షాధికారిగా, వ్యాపార రంగంలో తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుందని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: