భార‌త్‌లో క‌రోనా కేసులు ఉధృతంగా న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. భార‌త్ నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేదం విధిస్తున్నాయి. ఇండియా నుంచి వ‌చ్చే ప్యాసింజ‌ర్, క‌మ‌ర్షియ‌ల్‌ విమానాల‌ను 30 రోజుల‌పాటు నిషేధిస్తున్న‌ట్లు ర‌వాణాశాఖ మంత్రి ఒమ‌ర్ అల్ఘ‌బ్రా ప్ర‌క‌టించారు. భార‌త్ నుంచి కెన‌డాకు వ‌స్తున్న ప్ర‌యాణికుల్లో ఎక్కువ‌మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, భార‌త్‌తోపాటు పాకిస్తాన్‌కు కూడా ఈ నిర్ణ‌యం వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించారు. అయితే కార్గో విమానాలు, వ్యాక్సిన్ల వంటి అత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను ర‌వాణా చేసేవాటిని య‌థావిధిగా అనుమ‌తిస్తామ‌న్నారు. గ‌త 15 రోజుల్లో కెన‌డాలోని టొరంటో, వాన్‌కోవ‌ర్‌కు ఢిల్లీ నుంచి 18, లాహోర్ నుంచి రెండు విమానాలు వ‌చ్చాయ‌ని, వారిలో చాలామంది అనారోగ్యంతో ఉన్నార‌ని చెప్పారు. కెన‌డాకు వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు 14 రోజుల క్వారంటైన్ త‌ప్ప‌నిస‌ర‌ని స్ప‌ష్టం చేశారు. కెన‌డాలో నిన్న 9 వేల కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు కెన‌డాలో మొత్తం కేసుల సంఖ్య 11,51,276కు చేర‌గా, 23,812 మంది మ‌ర‌ణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: