చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్రముఖులు కరోనా వైరస్ బారినపడి త్వరగా కోలుకుంటున్నారు. రియల్ హీరో సోనూసూద్ కూడా కరోనా నుంచి బయటపడ్డారు. కరోనా సమయం నుంచి ఎంతో మందికి సాయం చేస్తున్న సోనూసూద్ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆచార్యతో పాటు మరి కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న సోనూ పాజిటివ్ అని తెలియగానే క్వారంటైన్ లోకి వెళ్లారు. సోనూ సూద్‌కు పాజిటివ్ వచ్చిందనే విషయం తెలుసుకుని అభిమానులు చాలామంది కంగారుపడ్డారు. ఎలా ఉన్నారంటూ అడిగినవారికి సోనూసూద్ అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ప్రజలంతా ఎలావున్నారని నన్ను అడుగుతున్నారని.. నేను బాగానే ఉన్నప్పటికీ కరోనా మాత్రం ఇబ్బంది పడుతోందంటూ సరదాగా ఇచ్చిన సమాధానం కూడా ఎంతో వైరలైంది. తాజాగా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా సోనూసూద్ బయటవారికి ఎంతోమందికి సాయం చేసి తన సహృదయాన్ని మరోసారి చాటుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: