ఏపీలో శనివారం నుంచి నైట్‌ కర్ఫ్యూ విధించారు. రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్రంలో 18 సంవ‌త్స‌రాలు దాటిన‌వారంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని సీఎం తెలిపారు. మంత్రులు, ఇత‌ర ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. మే 1 నుంచి 18- 45 మ‌ధ్య వయసు వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామన్నారు. అనంత‌రం స‌మావేశం వివ‌రాల‌ను వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాకు వివ‌రించారు. ఉచిత వ్యాక్సిన్ కోసం రూ. 1600 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌న్నారు. వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేసే ఆసుప‌త్రుల‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని,  సీటీ స్కాన్‌కు ధరలు నిర్ణయించాలని సీఎం ఆదేశించారని నాని చెప్పారు. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: