పశ్చిమ బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని భార‌తీయ జ‌న‌తాపార్టీ బెంగాల్ శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రతి ఒక్కరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామ‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొన్నారు. మే 5 నుంచి రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌ర్వాత‌రోజే బీజేపీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మే 5న అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామ‌ని మమత పేర్కొన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చంటూ మోదీ ప్రభుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. బెంగాల్‌లో తృణ‌మూల్‌, బీజేపీ మ‌ధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నిక‌ల స‌మ‌రం చివ‌రి అంకానికి చేరుకుంటోంది. మే 2న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: