సంగం డెయిరీలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారంటూ డెయిరీ ఛైర్మ‌న్‌, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ అనంత‌రం న‌రేంద్ర‌కుమార్‌ను కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా 14 రోజుల రిమాండ్ విధించ‌డంతో విజ‌యవాడ జిల్లా జైలుకు త‌ర‌లించారు. డెయిరీలో అక్ర‌మాలు జ‌రిగాయంటూ న‌రేంద్ర‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసినట్టు నోటీసులో ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం ధూళిపాళ్ల సంగం డెయిరీలో చైర్మన్‌గా కొన‌సాగుతున్నారు. అమూల్ డెయిరీ కోసం రాష్ట్రంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోన్న డెయిరీల‌ను నిర్వీర్యం చేయాల‌ని చూస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేత‌లు ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిపై ఆరోప‌ణ‌లు సంధిస్తున్నారు. రైతుల న‌మ్మ‌కాలను చూర‌గొన్న సంస్థ‌ల‌ను ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన సంస్థ‌ల ద‌గ్గ‌ర తాక‌ట్టుపెట్టాలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: