ఏపీలో క‌రోనా ప్ర‌ళ‌య గ‌ర్జ‌న చేసింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతోంది. అందుకు త‌గ్గ‌ట్లుగానే మ‌ర‌ణాల సంఖ్య కూడా ఉండ‌టంతో వైద్య‌, ఆరోగ్య‌శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 11,766 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన 4,441 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,00,9228కి చేరింది. 9,27,418 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 74,231కి పెరిగాయి. 7,579 మంది మ‌హ్మారికి బ‌ల‌య్యారు. రెండోద‌శ‌లో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం 18 సంవ‌త్స‌రాలు దాటిన‌వారంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలని నిర్ణ‌యించింది. భార‌త్ బ‌యోటెక్‌, హెటెరో డ్ర‌గ్స్ సంస్థ‌ల ఎండీల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇప్ప‌టికే ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన‌న్ని వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోర‌గా అందుకు ఆ రెండు సంస్థ‌లు అంగీక‌రించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: