నెస్లే కంపెనీ ఉత్ప‌త్తి చేస్తోన్న కిట్కాట్ చాక్లెట్‌ రేప‌ర్‌పై తప్పుడు స‌మాచారం ముద్రించారు. ఈ విష‌యాన్ని మ‌ణిపూర్ అట‌వీ శాఖాధికారి గుర్తించారు. వాస్త‌వాన్ని తెలుసుకొని  త‌ప్పును స‌రిచేయాలంటూ ఆ సంస్థ‌కు లేఖ రాశారు. కిట్కాట్ చాక్లెట్ రేప‌ర్‌పై కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ మేఘాల‌య‌లో ఉన్న‌ట్లుగా కంపెనీ వెల్ల‌డించింది. దానిపై రెడ్ పాండా ఫొటో కూడా ముద్రించారు. అయితే ఈ రెండు త‌ప్ప‌ని మ‌ణిపూర్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్‌లైఫ్‌) డాక్టర్ ఏకే జోషి తెలిపారు. ఆ జాతీయ‌ పార్క్ మణిపూర్‌లోని మొయిరాంగ్ వద్ద ఉంద‌ని, అక్క‌డ రెడ్ పాండాలు ఉండ‌వ‌న్నారు. ఈ త‌ప్పును స‌రిదిద్దాలంటూ నెస్లే సీఎండీ సురేశ్ నారాయణన్‌కు లేఖ పంపించారు. ఇది ఆ సంస్థ బాధ్యతారహితమైన చర్యగా ఏకే జోషి అభివ‌ర్ణించారు. వాస్తవాలను ధ్రువీకరించకుండా రేప‌ర్‌పై త‌ప్పుడు స‌మాచారం ముద్రించ‌డం స‌రికాద‌ని, త‌ప్పును స‌రిచేయాల‌ని, భ‌విష్య‌త్తులో ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: