దేశంలో క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత వరుసగా నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 21,954 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత వరుసగా నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవాళ మరో 1.92 లక్షల టీకాలు అందాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి కొవిషీల్డ్‌ టీకాలు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి టీకాలు చేరుకున్నాయి. ఇక్కడ నుంచి ఈ టీకాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ నుంచి ఆయా జిల్లాలకు పంపిణీ నిమిత్తం తరలిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: