డీఎంకే కూటమి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రోజు ఈ కూటమి కొత్త సర్కారు కొలువుతీరనుంది. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్టాలిన్ తో పాటు అయన మంత్రి వర్గానికి చెందిన 34 మంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం స్టాలిన్ ప్రభుత్వంలో ఎవరెవరు ఏ శాఖ లో మంత్రి గా పని చేయబోతున్నారనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1. ఎంకే స్టాలిన్‌: ముఖ్యమంత్రి
2. దురైమురుగన్‌: జల వనరులు
3. కేఎన్‌ నెహ్రూ: పురపాలక కార్యకలాపాలు
4. ఐ. పెరియసామి: సహకార శాఖ
5. ఎన్‌. పొన్ముడి: ఉన్నత విద్య
6. ఈవీ వేలు: పబ్లిక్‌ వర్క్స్‌
7. ఎంఆర్‌కే పన్నీరు సెల్వం: వ్యవసాయం, రైతు సంక్షేమం
8. కేకేఎస్‌ఆర్‌ రామచంద్రన్‌: రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
9. తంగం థెన్నరసు:  పరిశ్రమల శాఖ
10. ఎస్‌ రఘుపతి: న్యాయ శాఖ
11. ఎస్‌. ముత్తుసామి: గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి
12. కేఆర్‌ పెరియకరుప్పన్‌: గ్రామీణాభివృద్ధి శాఖ
13. టీఎం అంబారసన్‌: గ్రామీణ పరిశ్రమలు
14. ఎంపీ సామినాథన్‌: సమాచార, ప్రచార శాఖ
15. పి. గీతాజీవన్‌: సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత
16. అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌: మృత్స్యకార, జంతు పరిరక్షణ
17. ఎస్‌ఆర్‌ రాజకన్నప్పన్‌: రవాణా శాఖ
18. కే రామచంద్రన్‌: అటవీ శాఖ
19. ఆర్‌ చక్రపాణి: ఆహార, పౌర సరఫరా
20: వీ. సెంథిల్‌ బాలాజీ: విద్యుత్‌, ప్రొబిషన్‌, ఎక్సైజ్‌
21. ఆర్‌ గాంధీ: చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖ
22. ఎంఏ సుబ్రమణియన్‌: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
23. పి. మూర్తి: వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌
24. ఎస్‌ఎస్‌ శివశంకర్‌: బీసీ సంక్షేమం
25. పీకే శేఖర్‌బాబు: దేవాదాయ శాఖ
26. పళనివేల్‌ త్యాగరాజన్‌: ఆర్థిక, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌
27. ఎస్‌ఎమ్‌ నాజర్‌: పాలు, డెయిరీ డెవలప్‌మెంట్‌
28. జిగ్నీ కేఎస్‌ మస్తాన్‌: మైనారిటీ, ఎన్నారై సంక్షేమం
29. అన్బిల్‌ మహేశ్‌ పొయ్యమొళి: పాఠశాల విద్య
30. శివ వీ మెయ్యనాథన్‌: పర్యావరణ శాఖ
31. సీవీ గణేశన్‌: కార్మిక సంక్షేమం, నైపుణ్య శిక్షణ
32. టి మనో తంగరాజా: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
33. ఎం మతివెంతన్‌: పర్యాటక శాఖ
34. ఎన్‌కే సెల్వరాజ్‌: ఆది ద్రవిడ సంక్షేమం

 

మరింత సమాచారం తెలుసుకోండి: