ఏపీలో కరోనా విజృంభణ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొంది. సచివాలయం, ఆయా శాఖల అధినేతలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాల్లో ఈ మార్పులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 12.00 గంటలు దాటి ఆఫీసులో ఉండాల్సి వస్తే సదరు ఉద్యోగికి అవసరమైన పాస్ ని ఇవ్వాల్సిందిగా, అదే విధముగా ఆఫీసు పనివేళలు ను ఎలా ఉపయోగించుకోవాలో ఆ ఆఫీసు ముఖ్య అధికారికి అధికారాలను ఇస్తూ GO ని జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: