తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది.  తెలంగాణలో కరోనా విజృంభణ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు విధించిన కర్ఫ్యూ మరి కొన్ని దినాల్లో ముగియనుండగా మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ మేరకు ఈ నెల 15 వరకు రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. పెళ్లిళ్లకు 100 మందికి మించకుండా, అంత్యక్రియలకు 20 మంది మించరాదని స్పష్టం చేసింది. భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, మతపరమైన, సాంస్కృతిక సమావేశాలు, కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: