కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇక ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. పని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ ముందుకు వచ్చింది. సన్నీలియోన్ తన గొప్ప మనసు చాటుకుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న 10 వేల మంది వలస కార్మికులకు ఆహారాన్ని అందించనున్నారు బాలీవుడ్ నటి సన్నీ లియోని. అందుకోసం ఆమె పాటు పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) సంస్థ కూడా భాగమైంది. "ప్రస్తుతం మనమంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో అవసరమైన వారికి అండగా ఉండాలి. పెటా ఇండియాతో మరోసారి చేతులు కలపడం నాకు ఆనందంగా ఉంది. ఈసారి ఢిల్లీ నగరంలోని వేలాది కార్మికులకు అవసరమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించాం". సన్నీ లియోని తెలిపారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: