దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విలయతాండవం కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త రెండు రోజుల నుంచి వ‌రుస‌గా నాలుగు ల‌క్ష‌ల‌కుపైగానే కొత్త కేసులు న‌మోద‌వుతుండగా.. మూడు వేలమందికి పైగా బాదితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీందో పలు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఏపీలోను కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో 1,00,424 కరోనా పరీక్షలు చేయగా, 17,188 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఇక కరోనాతో బాధపడుతూ తాజాగా 73మంది మృతి చెందారని అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,45,374 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,71,60,870 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. రాష్ట్రంలో మొదటి విడత టీకాలకు ప్రస్తుతం అవకాశం లేదని, రెండో డోస్‌ టీకాలు తీసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. త్వరలో మరో 3.50లక్షల డోసులు ఇచ్చేందుకు సీరం అంగీకారం తెలిపిందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: