గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ అమలువుతోంది. మహమ్మారి కట్టడికి కఠిన లాక్‌డౌన్‌ విధించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున కర్ణాటకలో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ఈ నెల 10న (సోమ‌వారం) ఉద‌యం 6 గంటల నుంచి ఈ నెల 24 ఉద‌యం 6 గంట‌ల‌ వ‌ర‌కూ పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి యెడ్యూర‌ప్ప శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. క‌రోనా క‌ర్ఫ్యూ పెట్టిన పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింద‌ని ఆయ‌న అన్నారు. అన్ని హోట‌ళ్లు, ప‌బ్బులు, బార్లు మూసి ఉంటాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక హోట‌ళ్లు, మాంసం దుకాణాలు, కూర‌గాయ‌ల దుకాణాలు మాత్రం ప్ర‌తి రోజూ ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కూ తెరిచి ఉంటాయ‌ని చెప్పారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనే రోజువారీ కొవిడ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతూ వస్తున్నాయి. బుధవారం 50వేల మార్క్‌ను దాటాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్‌ డిమాండ్‌ సైతం పెరిగింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కర్ణాటక ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: