భారతదేశంలో కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది జీవితాలు రిస్క్ లో పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసుకునేందుకు వీలుగా తమ ఉద్యోగులకు అనుమతి ఇచ్చింది. శుక్రవారం రోజు ఇందుకు సంబందించిన ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా కేంద్ర ఉంద్యోగుల్లో ఉన్న గర్భిణులు, దివ్యాంగులు ఇంటి నుండి వర్క్ చేయచ్చని, కంటైన్మెంట్‌ జోన్లలో ఉంటున్న అధికారులు సైతం వర్క్ ఫ్రమ్‌ హోం చేసేలా వెసులుబాటు ఇచ్చింది. ఈ నెల 31 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. కాగా గత ఏప్రిల్‌ 19 నుంచే అన్ని కేటగిరీల ఉద్యోగులు ఇంటి నుంచే తమ విధులను చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: