మాములుగా ఇతర దేశాల రాజధానులు, కరెన్సీ గురించి చెప్పమంటే ఎవ్వరైనా ఒక నాలుగు లేదంటే ఐదు పేర్లు చెప్తారు. బాగా సాధన చేస్తే ఒక 20 దేశాల కరెన్సీ తో పాటు ఆ దేశ రాజధానులను గుర్తు పెట్టుకోవడం సైతం కొంత కష్టంతో కూడుకున్న పని. కానీ ఇండియాకు చెందిన ఒక పదేళ్ల చిన్నారి మాత్రం ఏకంగా 195దేశాల పేర్లు వాటి రాజధానులు మరియు ఆ దేశాల కరెన్సీ కూడా గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తుంది. ఈ చిన్నారి టాలెంట్ చూసి ప్రపంచంలోని అనేక దేశాల నుండి ప్రశంసలు సైతం అందుకుంటుంది. దుబాయిలో సెటిల్ అయిన ఒక రాజస్థాన్‌ జంటకు పుట్టిన సారా తన ఈ విషయంలో ప్రపంచ రికార్డు సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: