హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో శనివారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్‌స్కేల్‌పై 3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. అయితే, భూకంపంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. అలాగే 1.09 గంటల ప్రాంతంలో 2.9 తీవ్రతతో అసోంలో భూమి కంపించింది. గువాహటికి 35 కిలోమీటర్ల దూరంలో, 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు సెంటర్ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: