దేశంలో కరోనా వైరస్  రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా రక్కసి మరణమృదంగం కొనసాగుతోంది. నిత్యం లక్షల మందిపై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. తాజాగా ఒక్కరోజే 4వేలకుపైగా ప్రాణాలను బలి తీసుకుంది. దేశంలోకి కొవిడ్‌ ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,01,078 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.18కోట్లకు చేరింది. నిన్న ఒక్క రోజే అత్యధికంగా 4,187 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 2,38,270కి చేరింది. ప్రస్తుతం దేశంలో 37,23,446 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా 3,18,609 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తంగా 1,79,30,960 మంది కొవిడ్‌ బారి నుంచి బయటపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: