దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ర‌ణ మృదంగం మోగిస్తున్న‌ది.  దేశంలో మొద‌టిసారిగా శ‌నివారం నాలుగు వేల‌కుపైగా మ‌ర‌ణాలు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. కాగా, రోజువారీ కేసులు వ‌రుస‌గా నాలుగో రోజూ నాలుగు ల‌క్ష‌లు దాటాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్ల‌కు చేరువ‌లో నిలిచాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,03,738 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా 4,092 మంది వైర‌స్ వ‌ల్ల క‌న్నుమూశారు. ఇక ఏపీలో కూడా కరోనా తీవ్ర స్దాయిలో విజృంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా.. 22,164 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 92 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్‌ తెలిపారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 12,87,603కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 8,707 మంది మృతి చెందారు. కరోనా నుంచి 10,80,450 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,95,560 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: