తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కరోనా కట్టడికి విధానాలను ప్రవేశ పెడుతుంది. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సి‌ఎం కే‌సి‌ఆర్ సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. కరోనా విషయంలో వైద్య, ఆరోగ్య శాఖపై పని ఒత్తిడి తగ్గించేందుకు 50 వేల మంది ఎం‌బి‌బి‌ఎస్ వైద్యులను విధుల్లోకి తీసుకొనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఎం‌బి‌బి‌ఎస్ పూర్తి చేసిన వైద్యుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం పలకనున్నట్లు సి‌ఎం కే‌సి‌ఆర్ స్పష్టం చేశారు. రెండు నుండి మూడు నెలల కాలానికి వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించనున్నట్లు సి‌ఎం కే‌సి‌ఆర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: