కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి మే 22 వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉండనుందని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ సమయంలో అన్ని ఓపెన్ కానున్నాయి. నిత్యావసర వస్తువులు ఈ సమయంలోనే కొనుగోలు చేయాలి. అంటే రోజులో 20 గంటలు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది.

తెలంగాణలో లాక్ డౌన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమని ప్రశ్నించిందంటే.. “సడెన్ గా లాక్ డౌన్ అంటే ఎలా. ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వెళ్లి పోతారు. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా సడెన్ గా లాక్ డౌన్ ఏంటి. తక్కువ టైంలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వెళ్తారు. నేడు ఉదయం వరకు ప్రభుత్వానికి కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన కూడా లేదు. కానీ నేడు అనూహ్యంగా ఈ నిర్ణయమేంటి..?? అని హైకోర్టు తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: