కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి మే 22 వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉండనుందని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ సమయంలో అన్ని ఓపెన్ కానున్నాయి. నిత్యావసర వస్తువులు ఈ సమయంలోనే కొనుగోలు చేయాలి. అంటే రోజులో 20 గంటలు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది.

తెలంగాణ రాష్ట్రంలో లాక్‎డౌన్ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్డౌన్ కాలంలో వైన్స్‌లను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక మందుబాబులు తెల్లారి లేవంగానే మద్యం దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: