కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి మే 22 వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉండనుందని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు.  

తెలంగాణలో లాక్ డౌన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  “సడెన్ గా లాక్ డౌన్ అంటే ఎలా. ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వెళ్లి పోతారు. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా సడెన్ గా లాక్ డౌన్ ఏంటి. తక్కువ టైంలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వెళ్తారు" అంటూ మండిపడ్డింది. అదే విధంగా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఎందుకు ఆపుతున్నారు. అంబులెన్స్ లను ఆపాలని ఎవరు చెప్పారు. కనీసం మానవత్వం లేదా. హైదరాబాద్ మెడికల్ హబ్. చికిత్సకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. వారిని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిది. చికిత్సకు రావద్దని చెప్పే అధికారం మీకు ఎక్కడిది. ప్రజల ప్రాణాలను తీస్తారా. దేశ రాజధాని ఢిల్లీ కి కూడా ఎంతో మంది పేషంట్లు ఎన్నో రాష్ట్రాల నుండి వస్తుంటారు. అలా అని ఢిల్లీ లో అంబులెన్స్ లను ఆపెస్తున్నారా. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే అంబులెన్స్ లను ఆపడం ఏంటి..?? గతంలో మేం చెప్పినట్టు మొబైల్ టెస్ట్ లను కూడా మీరు నిర్వహించలేక పోయారు కానీ ఇప్పుడేమో అంబులెన్స్ లను ఆపెస్తున్నారు"అని హైకోర్టు తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.



 

మరింత సమాచారం తెలుసుకోండి: