హైద‌రాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ప‌దిరోజుల పాటు లాక్‌డౌన్ పెట్ట‌డంతో మందుబాబులు ఉరుకులు ప‌రుగులు పెడుతున్నారు.త‌మ‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న వైన్ షాపుల ముందు క్యూ క‌డుతున్నారు. ప‌దిరోజుల వ‌ర‌కు ఆంక్ష‌లు ఉండ‌టంతో షాపులు తెరుస్తారో లేదో అనుకుని ఒక్క‌సారిగా భారీగా మ‌ద్యకొనుగోలు చేసేందుకు ఎగ‌బ‌డ్డారు.ఒక్కొక్క‌రు ప‌దిరోజుల‌కు స‌రిస‌డా మద్యం కొనుగోలు చేస్తున్నారు.
అయితే కొద్దిసేప‌టికి కిత్రం మద్యం ప్రియుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ లో మ‌ద్యం దుకాణాలు ఇచ్చిన స‌మ‌యంలో తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఉండాల‌ని ఈ చర్యలు చేపట్టింది.ఉద‌యం 6గంట‌ల నుంచి 10గంట‌ల వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని మ‌ద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి.. 10గంట‌ల త‌రువాత ఎక్క‌డా కూడా మ‌ద్యం దుకాణాలు అందుబాటులో ఉండ‌వు.అయితే  దుకాణాలు నాలుగు గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే తెరిచి ఉండ‌టంతో ర‌ద్దీ ఎక్కువ అయ్యే అవ‌కాశం ఉంది.తెల్ల‌వారాగానే మ‌ద్యం దుకాణాల వ‌ద్ద క్యూలు క‌ట్టాల్సి ఉంటుంది.మ‌ద్యం కొనుగోలు చేసే వారు దుకాణాల వ‌ద్ద తోపులాట చేసుకోకుండా భౌతిక‌దూరం పాటించాల‌ని అధికారులు తెలిపారు.

ఇక మందుబాబులు లాక్డౌన్లో మద్యం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఈఇప్పటికే రాష్ట్రంలో లాక్డౌన్ ఉంటుందని చాలాచోట్ల నెలకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలకు ఈ వెసలుబాటు కల్పించ‌డం మందుబాబుల‌కు వ‌రంలా ఉంది.కానీ మ‌ద్యం దుకాణాలు కోవిడ్ హాట్‌స్ఫాట్స్‌గా మారుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ పెట్టి వైన్ షాపులు తెరిచి  ఉంచితే ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో మ‌ద్యం దుకాణాల తెరిచిన త‌రువాతే కేసులు ఎక్కువ‌గా పెరిగాయి. కాబ‌ట్టి మ‌ద్యం దుకాణాల‌కు లాక్‌డౌన్ నుంచి వెసులుబాటుట ఇవ్వొద్ద‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఎది ఎలా ఉన్న ప్ర‌జ‌లంద‌రు లాక్‌డౌన్ లో బ‌య‌టిరాకుండా స్వీయ‌నిర్భంధంలో ఉండ‌క‌పోతే కోవిడ్ బారిన ప‌డే అవ‌కాశం ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: