తెలంగాణ ప్ర‌భుత్వం అంతా.. అనుకున్న‌ట్లే నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణ‌యం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి మే 22 వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉండనుందని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు.
 
అయితే సడెగా లాక్ డౌన్ అనే సరికి ప్రజలు నిత్యవసరాల సరుకుల కోసం పరుగులు తీసారు. తెలంగాణ లాక్డౌన్ త్వరలోనే విధించబడుతుందని అంచనాలు ఉన్నప్పటికీ.. రేపటి నుండి లాక్‌డౌన్ విధించిన నిర్ణయం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం గరిష్ట క్యూలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?  రేషన్లు, కిరాణా, పాలు, కూరగాయలు ముందు కాదు, మద్యం దుకాణాల ముందు. తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడగానే మందుబాబులు మత్తు వదిలించుకుని మరీ మద్యం దుకాణాలవైపు పరుగులు పెట్టారు. నగరంలోని అన్ని మద్యం దుకాణాల వద్ద భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టారు. కొన్ని మద్యం షాపుల వద్ద దాదాపు కి.మీ. మేర మందుబాబులు బారులు తీరడం.. కనీస భౌతికదూరం పాటించకుండా మద్యం కోసం పోటీ పడటం గమనార్హం. దీంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: