తెలంగాణ ప్ర‌భుత్వం అంతా.. అనుకున్న‌ట్లే నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌స్తుతం ఈ భేటి కొన‌సాగుతోంది. తెలంగాణ‌లో రేప‌టి నుంచి ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే లాక్‌డౌన్ విధిస్తే వ‌ల‌స కూళీలు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లే అంశంపై కూడా భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌తేడాది లాక్‌డౌన్ అప్పుడు కూళీలు ఇబ్బంది ప‌డ్డారు. ఈసారి ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నాలు చేసే ఆలోచ‌న టీఎస్ ప్ర‌భుత్వం ఉంది. ఇందు కోసం ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: