జీవీఎంసీ పరిధిలో బాల్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న తాము రెగ్యులర్‌ టీచర్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా.. తమకు కనీస వేతనాలు చెల్లించడంగానీ, తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంగానీ చేయడం లేదంటూ జానపరెడ్డి సూర్యనారాయణ, మరో 49 మంది హైకోర్టులో గత ఏడాది పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఔట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా వారితో సమానంగా కనీస వేతనం చెల్లించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సమాన పనికి కనీస వేతనం కూడా చెల్లించకపోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, రాజ్యాంగంలోని అధికరణ 14 ప్రకారం వివక్ష చూపడమేనని తేల్చి చెప్పింది. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో బాల్వాడీ టీచర్లుగా పని చేస్తున్న వారికి కనీస వేతనం చెల్లించాలని పురపాలకశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న హైకోర్టు తీర్పు.. భవిష్యత్తులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పాలిట వరంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: