దేశంలో క‌రోనా ఉగ్రరూపం కొన‌సాగుతూనే ఉంది. దేశంలో క‌రోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,48,371 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. యాక్టివ్ కేసులు కూడా మ‌రో నాలుగు వేలు త‌గ్గ‌డంతో 3.71 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయాయి. ఇక నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో 4205 మంది బాధితులు మృతిచెందారు. ఒకేరోజు ఇంత భారీసంఖ్య‌లో క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. అయితె ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్‌ ఇచ్చింది. మే 14 నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. బలపడిన అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ఛాన్స్‌ ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించింది. ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్ అవుతుందన్నారు. దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: