తెలంగాణలో నేటి నుంచి మే 21 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. నేడు లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 6 నుంచి 10 వరకు మినహాయింపునిచ్చారు. కొద్ది సేపటి క్రితమే తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో కొన్ని సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఇక తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి మంగళవారం సాయంత్రం ఏపీకి భారీగా వాహనాలు వచ్చాయి. అప్రమత్తమైన ఏపీ పోలీసులు రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద వాహనాలను ఆపి.. సరైన కారణాలు ఉన్న వాటిని రాష్ట్రంలోకి అనుమతిచ్చారు. మిగిలిన వాహనాలను వెనక్కి పంపించారు. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలతో లాక్‌డౌన్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన పోలీస్‌ శాఖ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఇదిలా ఉంటే లాక్ డౌన్ సమయంలో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారి వద్ద ఈ-పాస్‌లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: