కరోనావైరస్ బారిన పడకుండా ఉండేందుకు శానిటైజేషన్ చేయడం తప్పనిసరిగా మారింది. అందుకే ఏ వస్తువులనైనా సులభంగా శానిటైజ్ చేసే మల్టీ క్యాబినెట్ పరికరం అందుబాటులోకి వచ్చింది. కరోనా సమయంలో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు 'శుద్ధీకరణ్‌' పేరుతో మూడు మల్టీ డిజైన్లను రూపొందించారు. ప్రత్యేకించి తమ క్యాంపస్ లో వాడేందుకు తయారుచేశారు. ఇది నిమిషాల వ్యవధిలోనే కరోనావైరస్ ను అంతం చేసేస్తుంది. బయట నుంచి తెచ్చిన ఏ వస్తువునైనా సులభంగా నిమిషాల్లోనే శానిటైజ్ చేసేస్తుంది. బయటి నుంచి లోపలికి వచ్చే వ్యక్తులు తెచ్చే వస్తువులను వైరస్‌ రహితంగా మార్చేస్తుంది. ప్యాకింగ్‌ చేసిన తినే ఆహార పదార్థాలను కూడా శానిటైజ్ చేసుకోవచ్చు.వస్తువులను లోపల ఉంచితే మూడు నిమిషాల్లో వైరస్‌ రహితంగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: