తెలంగాణలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఉంది. ఇక పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి 22వ తేదీ వరకు ఆదేశాలు అమలు కానున్నాయి. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలతో లాక్‌డౌన్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన పోలీస్‌ శాఖ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఇదిలా ఉంటే లాక్ డౌన్ సమయంలో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారి వద్ద ఈ-పాస్‌లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: