తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఆఖరి అస్త్రం అయిన లాక్‌డౌన్‌ కూడా విధించింది. అయితే క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌తి ఒక్క‌రూ డ‌బుల్ మాస్కు ధ‌రించాల‌ని అటు వైద్య నిపుణులు, ఇటు ప్ర‌భుత్వాలు కోడై కూస్తున్న కొంత‌మందికి అస‌లు చెవిన ప‌ట్ట‌డం లేదు. అయితే దీనిపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. హైదరాబాద్‌ మాజీ మేయర్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాస్క్‌ లేకుండా కారులో కనిపించారు. గమనించిన పోలీసులు ఫైన్‌ విధించారు. కారులో వెళ్లినా కూడా మాస్కు ధ‌రించాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులిచ్చిన సంగతి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ తీగల కృష్ణారెడ్డి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి మాస్క్‌ లేకుండా తిరగడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డికి పోలీసులు జరిమానా వేశారు. నగరంలోని కర్మాన్‌ఘాట్‌ చౌరస్తా వద్ద సరూర్‌నగర్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో మాస్కు పెట్టుకోకుండా కారులో వెళ్తున్నందుకు కృష్ణారెడ్డికి రూ.వెయ్యి జరిమానా విధించారు. కారులో వెళ్తున్నా మాస్కు ధరించాల్సిందే అని ఎస్సై చెప్పడంతో తీగల కృష్ణారెడ్డి, సబ్ఇన్‌స్పెక్టర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. తమకు అందరూ సమానమేనని ఎస్సై తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సిందేనని..చెప్పారు సరూర్‌నగర్‌లో పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: