దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికై పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ బాటపట్టగా.. పలు రాష్ట్రాలు అదే తరహా నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడుతోంది. దీంతో తాజాగా ఈశాన్య సరిహద్దు రైల్వే 31 రైళ్లను బుధవారం రద్దు చేసింది. పలు రైళ్లు బుధవారం నుంచి, మరికొన్ని ఈ నెల 13, 14, 15 నుంచి రద్దవుతాయని పేర్కొంది. దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ రైళ్లు నడవవని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: