అమ‌రావ‌తి : ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు ఎలా ఉండాల‌నే దానిపై సీఎం జ‌గ‌న్ అధికారులు, మంత్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ప్ర‌తిరోజు 20వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా లాక్‌డౌన్ విధించాల‌ని ప్రభుత్వం భావిస్తుంది.ఇప్ప‌టికే పొరుగు రాష్ట్రాలు లాక్‌డౌన్ పెట్ట‌డంతో క‌రోనా వ్యాప్తి కొంత త‌గ్గింది.కాబ‌ట్టి ఏపీలో కూడా లాక్‌డౌన్ పెట్టి ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసే విధంగా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తుంది.

రేపు సాయంత్రంలోగా రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. తెలంగాణ‌లో ఉద‌యం 6గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే వ్యాపార కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఉంది.ఏపీలో కూడా అదే విధంగా లాక్‌డౌన్ ఉంటుందా లేక స‌మ‌యాన్ని ఇంకా కుదిస్తారా అనేది చూడాల్సి ఉంది.గ‌త లాక్‌డౌన్‌లో ఉద‌యం 6గంట‌ల నుంచి 9గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు కొనుగోలుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.ఇప్పుడు కూడా అదే విధంగా లాక్‌డౌన్ ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తుంది.

ఇప్ప‌టికే క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద‌యం 6 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే షాపుల‌కు అనుమ‌తి ఇచ్చింది.అయిన‌ప్ప‌టికి క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేసేందుకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్  రాబోతుంది.లాక్‌డౌన్‌లో ఎమర్జెన్నీ సేవ‌లు,వ్య‌వ‌సాయం,మీడియా రంగాల‌ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని ప్రభుత్వం భావిస్తుంది. మ‌రోవైపు ప్ర‌భుత్వానికి కీల‌క ఆదాయ వ‌న‌రుగా ఉన్న మ‌ద్యం దుకాణాల‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.గ‌తంలో పూర్తిస్థాయిలో మ‌ద్యం దుకాణాలు మూసిన‌ప్ప‌టికీ...అన్‌లాక్‌లో మ‌ద్యం దుకాణాలే ముందుగా తెరిచారు.కేసుల తీవ్ర‌త దృష్ట్యా మ‌ద్యం దుకాణాల‌ను కూడా మూసివేస్తే క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కొంత‌వ‌ర‌కు నియంత్రించ‌వ‌చ్చు.ఇప్ప‌టికే క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతుండ‌టంతో లాక్‌డౌన్ నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం ఎప్పుడో తీసుకోవాల్సి ఉన్నా వేచి చూడ‌టం వ‌ల్లే క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కాలేద‌ని వైద్య నిపుణులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: