దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఏడాదిన్నరగా భూగోళాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే దాదాపు చాలా మందిని పొట్టనపెట్టుకుంది. సెకండ్ వేవ్ లో భారత్ ను మాత్రమే టార్గెట్ చేసిందా అన్నట్లుగా రోజువారీ కొత్త కేసులు, మరణాలు పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్నాయి.  ప్రస్తుతం భారత్‌లో దాదాపు 90 శాతం ప్రాంతాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 734 జిల్లాలకుగానూ 640 జిల్లాల్లో పాజిటివిటీ రేటు కేంద్రం నిర్దేశించిన ఐదు శాతం పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తొలిస్థానంలో ఉండగా, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.  భారత్‌లో మరో రెండు నెలలపాటు విపత్కర పరిస్థితులు కొనసాగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: