కరోనాతో ప్రజలు వణికిపోతుండగా, ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ ఒకటి వెలుగులోకొచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్–19 నుంచి కోలుకున్న వారిలో ముకోర్మైకోసస్ అని పిలిచే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. అయితే, బ్లాక్ ఫంగస్ మీద భారత ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. దేశంలో పలు చోట్ల బ్లాక్ ఫంగస్ కేసులు నమోదువుతున్న నేపథ్యంలో ఈ కొత్త మహమ్మారిని ఎదుర్కొనే ‘ఆంఫోటెరిసిన్-బీ’ డ్రగ్ లభ్యతను కేంద్ర ప్రభుత్వం పెంచే ప్రయత్నం చేస్తోంది. బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు వైద్యులు ‘ఆంఫోటెరిసిన్-బీ’ అనే మందును సూచిస్తుండటంతో మార్కెట్లో ఈ డ్రగ్ కొరత ఏర్పడకుండా ముందు నుంచీ చర్యలు ముమ్మరం చేస్తోంది. ఇలా ఉండగా.. మహారాష్ట్రలోనూ దాదాపు 2వేలకు పైగా బ్లాక్‌ఫంగస్‌ కేసులు ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ముందుజాగ్రత్తగా అక్కడి మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ప్రత్యేక చికిత్స కేంద్రాలుగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: