ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు ఏపీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. బడ్జెట్‌ ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో సభ జరిగే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విష‌యాన్ని బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు.ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం సాయంత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. 2021-22కు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగముండగా.. అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి. అయితే, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించేందుకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: