ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ కరోనా బులిటెన్ ను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 90,750 శాంపిల్స్ ను పరీక్షించగా 21,452 మందికి  కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,44,386కి చేరింది. అందులో 11,38,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా మృతులతో కలిపి మరణాల సంఖ్య 8,988కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,97,370 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కోవిడ్ వల్ల విశాఖలో 11 మంది, తూర్పు గోదావరిలో 9, క్రిష్ణాలో 9, విజయనగరంలో 9, చిత్తూరులో 8, గుంటూరులో 8, నెల్లూరులో 8, శ్రీకాకుళంలో 7, అనంతపురం 6, కర్నూలులో 5, ప్రకాశంలో 4, పశ్చిమగోదావరిలో 3, కడపలో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 19,095 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. నేటి వరకూ రాష్ట్రంలో 1,76,05,687 శాంపిళ్లను పరీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: