కరోనా వైరస్ రెండో దశలో ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకూ ప్రతీ ఒక్కరిని ఈ మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అయితే, ఇప్పటికే ఎంతో మంది ప్రజా ప్రతినిధులు ఈ మహమ్మారి కరోనా బారిన పడగా.. తాజాగా కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ కొవిడ్ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకున్న ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయాని జి వీరపాండియన్ బుధవారం నాడు స్వయంగా ప్రకటించారు. ఇటీవల ఆయనను కలిసి నటువంటి ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టు చేయించుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: