కరోనా కష్టకాలంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలు కోసం.. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల పిల్లలు కోసం.. ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలకు.. చికిత్స పొందుతున్న పిల్లలకు సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: