దేశంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) కీలక సూచన చేసింది. కరోనా పాజిటివిటీ 10 శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8వారాల పాటు లాక్‌డౌన్‌ అమలు చేయాలని సూచించింది. అప్పుడే కరోనా వ్యాప్తిని నియంత్రించడం సాధ్యం అవుతుందని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం 17 శాతం పాజిటివిటీ రేటు ఉందని.. ఢిల్లీలో లాక్ డౌన్ ఎత్తేస్తే పెను విధ్వంసం తప్పదని హెచ్చరించారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు సరాసరి 21 శాతం ఉన్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: