ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలు, అమ్మకం మరియు సరఫరాకు సంబందించిన కాంట్రాక్టు ని జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ కి అప్పగించింది. కాగా ఆలస్యంగా ప్రారంభం అయిన ఈ కార్యక్రమం లాంఛనంగా తూర్పు గోదావరి జిల్లాలో మొదలు కానుంది. ఇందుకు సంబందించిన ఒక నెలకు సరిపడా ఇసుక పై రాబోయే లాభాలను జెపి సంస్థ, ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, అందుకోసం 31 కోట్లను డిపాజిట్ చేసింది. మరి కొన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తం గా ఈ ప్రక్రియ కొనసాగుతుండగా, స్టాక్‌యార్డులు మరియు ఆ స్టాక్‌యార్డుల్లో ఉన్న ఇసుకను సైతం క్రమక్రంగా జెపి సంస్థకు అప్పగిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: