దేశంలో కరోనా మహమ్మరి తీవ్రంగా విజృంభిస్తుంది. రెండు రోజులు త‌గ్గిన కేసులు మ‌ళ్లీ పెరిగాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 3,62,720 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 4136 మంది మ‌ర‌ణించారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. అనేక వేల మంది వైద్యం అందక, సరైన సమయానికి ఆక్సిజన్ అందక బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్‌లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది.  ట్యాంకర్‌లోని ఆక్సిజన్‌ను ఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లీకైంది. దీంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం తెల్లని పొగలా ఆక్సిజన్ దట్టంగా కమ్మేసింది. ఆక్సిజన్ లీకైనప్పటికీ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, కాన్సంట్రేటర్లు ఉండడంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ వివిచారణకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: